బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టవచ్చు కదా: రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సూచన

బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టవచ్చు కదా: రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సూచన
  • ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే పరిశ్రమ పెట్టాలని సూచన
  • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు వచ్చాయన్న ఈటల రాజేందర్
  • రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీత

బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవచ్చు కదా అని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ పరిశ్రమను నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వవచ్చని సూచించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు భారీగానే నిధులు కేటాయించామని వెల్లడించారు.